బీసీ మహిళలకు ఉపకోటా ప్రకటించాలి
పాతమంచిర్యాల: మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాలని బీసీ హక్కుల పో రాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సూ పరింటెండెంట్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం బీసీ జనాభా ఉంటే ఇందులో సగం మంది బీసీ మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు సముచిత స్థానం లభించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్‌తో మహిళా బిల్లు తీసుకురావాలని చూస్తోందని పేర్కొన్నారు. ఇందులో బీసీ మహిళలకు 18శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల వాటా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అంకం సతీశ్, భీంసేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment