చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాజెక్ట్‌ల కింద చివరి ఆయకట్టు వరకు పంటలకు నీరందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం క లెక్టరేట్‌లో నీటి పారుదల శాఖ ఈఈ, డీఈఈ, ఏ ఈఈలతో సాగునీటి నిర్వహణపై సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి నిల్వ 11.4 టీఎంసీలు ఉందని, కార్యాచరణ ప్రకారం నీ టిని విడుదల చేస్తామని తెలిపారు. సుందిళ్ల, అన్నా రం, గూడెం ఎత్తిపోతల, ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్‌ల నుంచి నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నీల్వాయి ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జూన్ 15వరకు జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సిర్సా ఎత్తిపోతల పథకం, అర్జునగుట్ట, కిష్టాపూర్ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
పంటల సాగుకు సహాయం
జైపూర్: జిల్లాలో పంటల సాగుకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలో ని సుందిళ్ల బ్యారేజీ, శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తహసీల్దార్ వనజారెడ్డి, మండల పరిషత్ అధికారి జి.సత్యనారాయణతో కలిసి పర్యటించి రైతులతో వ్యవసాయ పరిస్థితులపై సమీక్షించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం, ఇతర నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి, ఎల్‌ఆర్‌ఎస్ రుసుం, ఆస్తిపన్ను వసూలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఎస్సై నాగరాజు, ఏపీవో బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తాగు నీటిసమస్య తలెత్తకుండా చర్యలు
భీమారం: వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలో ని దాంపూర్ గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల సంరక్షణ చర్యలను పరిశీలించారు. గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బన్సీలాల్, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment