మట్కా నిర్వాహకుడి అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై వీ.పురుషోత్తం సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు చేసి మట్కా నిర్వహిస్తున్న ఆవునూరి శ్రీనివాస్‌ను అదుపులోనికి తీసుకుని అతని వద్ద గల రూ.25,000 నగదు, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటిని గిమ్మ గ్రామానికి చెందిన మాధవ్, మహారాష్ట్రకు చెందిన మట్కా వ్యాపారి అశోక్ సామ్రాట్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పేకాట, మట్కా, గుట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే జైనథ్ సీఐ 8712659916, ఎస్సై 8712659929 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.