దండేపల్లి: మండలంలోని కాసిపేట గోదావరినది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గురువారం పోలీసులు నదీ తీరానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ట్రాలీనుంచి ఇంజన్‌ను వేరు చేసి ఇంజిన్లతో బయటకు వచ్చారు. అయినా పోలీసులు ఎవరినీ వదిలిపెట్టలేదు. ట్రాక్టర్ల యజమానులకు సమాచారం ఇచ్చి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదేంలేక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో ట్రాక్టర్ నదిలో దిగబడినట్లు సమాచారం. పట్టుబడిన నాలుగు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలు
బజార్‌హత్నూర్: మండలంలోని దేగామ క్రాస్ రోడ్డు వద్ద ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఆందుగూడకు చెందిన కోవ రఘునాథ్ కుటుంబం గురువారం మాడగూడకు ఆటోలో వెళ్లివస్తుండగా దేగామ మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది. కోవ దినేష్‌కు తీవ్ర, మిగతా వారికి స్వల్పగాయాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. దినేష్‌ను మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు.