
విద్యార్థులకు వైద్య పరీక్షలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగవంతం వాడలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యా ధులు, కంటి పరీక్షలపై అవగాహన కల్పించా రు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని 60 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. సీనియర్ సి విల్ జడ్జి అర్పితరెడ్డి, జిల్లా ఉపవైద్యాధికారి ఎస్.అనిత, జిల్లా ఇంచార్జి సంక్షేమ శాఖ అధికా రి రాజేశ్వరి, డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.