
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్ష జవా బు పత్రాల మూల్యాంకనం సోమవారం స్థాని క ఏసీసీ కార్మెల్ హైస్కూల్‌లో ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఉదయం 8గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు రాకపోవడంతో మూల్యాంకనం ఆలస్యమైంది. రిపో ర్టు చేయని టీచర్లకు నోటీసులు జారీ చేస్తామని మైకులో హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. అనారోగ్యం, ఇతర అత్యవసర కారణాలు చూపుతూ విధులకు దూరంగా ఉండేందుకు ప డరాని పాట్లు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత మూల్యాంకనం మొదలైంది. ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన 1,29,281 జవాబు పత్రాలు మూల్యాంకన కేంద్రానికి చేరాయి. మొదటి రోజు 7280 పేపర్లు మూల్యాంకనం చేశారు. అసిస్టెంట్ క్యాంపు ఆ ఫీసర్లు 7, చీఫ్ ఎగ్జామినర్లు65, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 390, స్పెషల్ అసిస్టెంట్లు 130మంది మూల్యాంకన విధులకు హాజరయ్యారు.
డ్యూటీ చేస్తారా.. వెళ్లిపోతారా..?
రిపోర్టు చేయకుండా చెట్ల కింద, వరండాలో తిరుగుతున్న ఎగ్జామినర్లను డీఈవో యాద య్య మందలించారు. మధ్యాహ్న సమయం దాటినా హిందీ, బయోసైన్స్ టీచర్ల కొరత కనిపించింది. చాలామంది విధుల ఉత్తర్వులు రద్దు చేయించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సమయం దాటిపోతున్నా రిపోర్ట్ చేయనిటీచర్ల వద్దకు డీఈవో వెళ్లి డ్యూటీ చేస్తారా.. వెళ్లిపోతారా అంటూ మందలించారు.