● మూడున్నర గంటల పాటు క్యాబిన్‌లోనే డ్రైవర్
కాసిపేట: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో మూడున్నర గంటలపాటు డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుని నరకయాతన అనుభవించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఫ్‌లై ఓవర్‌పై గురువారం తెల్లవారుజామున ఇనుపరాడ్‌ల లోడ్‌తో ఆగి ఉన్న లారీని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయి నుంచి ఐరన్ షీట్ల లోడుతో వచ్చిన మరోలారీ ఢీకొట్టడంతో క్యాబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ గురుజీత్‌సింగ్ అందులోనే చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మూడున్నర గంటలపాటు శ్రమించి చివరకు గ్యాస్ కట్టర్‌తో క్యాబిన్ కొంతభాగం కట్‌చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.