● సాహితీఖిల్లాగా విరాజిల్లుతున్న నిర్మల్ ● సాహితీవేత్త
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా అనగానే మొదట గు ర్తుకు వచ్చేది కవులు, కళాకారులే.. సాహితీపరంగా చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మల్ సాహితీ జిల్లాగా పేరు గాంచింది. ఇప్పటికే ఇక్కడి నుంచి వందలాది మంది కవులు, రచయితలు సాహితీ రంగంలో తమదైన ప్రతిభ చాటుతున్నారు. జిల్లాలో తొలితరం కవుల నుండి మొదలుకొని ప్రస్తుతం ఉన్న పద్యకవులు, వచన కవులు, కళాకారులు సాహితీవేత్తల వరకు కొదువలేదు. ప్రాచీన కవులు బోయ ధర్మయ్య, మామడ మునిపంతులు, పొన్నకంటి రాజయ్య నేటితరాన్ని ప్రభావితం చేసిన మడిపల్లి భద్రయ్య ఉన్నారు. ఆధునిక కవులలో ప్రస్తుతం బొందిడి పురుషోత్తం, నేరెళ్ల హ న్మంతు, వెంకట్, చక్రధారి, దామెర రాములు, పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావు, కరిపె రాజ్‌కుమార్, పుండలీక్‌రావు, పోలీస్ భీమేష్, కృష్ణంరాజు, కామారపు జగదీశ్వర్, అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి, తొడిశెట్టి పరమేశ్వర్.. ఇలా మరెందరో కవులు, రచయితలు తమ రచనలతో సామాజిక చైతన్య ప్రతీకలుగా కొనసాగుతున్నారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జిల్లా కు చెందిన పలువురు కవుల అభిప్రాయాలు.
సమాజమంతా కవిత్వం మిళితమై...
సమాజమంతా కవిత్వం మిళితమై ఉంటుంది. కవిత్వంలేని సమాజం ఊహించలేం. సమాజాన్ని చైతన్యవంతం చేయడమే కవిత్వం పని. పల్లె పదాలతో అల్లుకున్న కవిత్వపు పాట ప్రజల నాలుకలపై సజీవంగా నడయాడుతుంది. ఆహ్లాద జీవితానికి కవిత్వం దోహదపడుతుంది. ఇప్పటికీ గ్రామీణ జన బాహుళ్యంలో పాటలు, కోలాటాలు, బతుకమ్మ, భజన పాటలతో సమాజాన్ని చైతన్య పరుస్తోంది కవిత్వమే. – తుమ్మల దేవరావు,
సాహితీవేత్త, చరిత్రకారుడు, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment