కాసిపేట గనిపై అస్వస్థతకు గురైన కార్మికుడు
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కాసిపేట 1గనిపై గురువారం శశికాంత్ అనే రూప్ లేసర్ కార్మికుడు ప్రీ షిప్టు, మొదటి షిప్టు విధులు నిర్వహించి కళ్లు తిరిగి పడిపోయాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం శశికాంత్ ఉదయం 5 గంటలకు ప్రీ షిప్టు విధులకు హాజరయ్యాడు. గనిలో తెగిపోయిన తాడును జాయింట్ చేసే పనిలో నిమగ్నంకాగా పని పూర్తికాక పోవడంతో అధికారుల ఒత్తిడి మేరకు మొదటి షిప్టు విధులు కూడా నిర్వర్తించాడు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గనిపైకి రాగా కళ్లు తిరిగి పడిపోయాడు. తోటి కార్మికులు ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి, అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదనంగా షిప్టు నిర్వహించే కార్మికుడికి కనీసం టిఫిన్, పండ్లు, భోజనం ఏదైనా పంపించాల్సి ఉండగా అలా చేయకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
అధికారుల ఒత్తిడే కారణం
కార్మికునికి ఇలా కావడానికి అధికారుల ఒత్తిడే కారణమని ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య విమర్శించారు. గురువారం రాత్రి కార్మి కుడిని పరామర్శించారు. గుర్తింపుసంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దా గం మల్లేశ్ మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి కారణంగానే కార్మి కులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment