క్షయవ్యాధి నిర్మూలనకు చర్యలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన మందులు అందిస్తున్నామని, జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్బంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రారంభించారు. అనంతరం క్షయ నివారణకు ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకు రావాలని, నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి సురేందర్, డీపీఎం ప్రశాంతి, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment