
షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
సిరికొండ: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని కొండాపూర్ శివారులో జరిగింది. కొండాపూర్ శివారులో మండల కేంద్రానికి చెందిన సాయిని స్వామి, సాయిని భూమన్న పంట పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద శుక్రవారం షార్ట్ సర్క్యూట్‌తో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మొక్కజొన్న పంటకు మంటలు వ్యాప్తించాయి. సా యిని స్వామి రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తి గా దగ్ధమైంది. 80 పైపులు కాలి బూడిదయ్యాయి. సాయిని భూమన్న మొక్కజొన్న పంట కూడా దగ్ధమైంది. సాయిని స్వామికి రూ.2లక్షలు, సాయిని భూమన్నకు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. దీంతో బాధిత రైతులు బోరున విలపించారు.

షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం