
సరస్వతి కెనాల్‌లో మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ శివారు గల సరస్వతి కెనాల్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై మాలిక్ రెహమాన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. సరస్వతి కాలువ నుంచి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎత్తు 5 ఫీట్లు, మృతుడిపై ఆరెంజ్ కలర్ టీషర్ట్, బ్లూకలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే ఎస్సై నంబర్ 8712659521, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి 8712659519 నంబర్లలో సమాచారం అందించాలని సూచించారు.