
ఆలయాల్లో చోరీ నిందితుల అరెస్ట్
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంతో పాటు తర్లపాడ్‌లోని అగ్గి మల్లన్న ఆలయాల్లో ఇటీవల చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సీహెచ్ అజయ్ కుమార్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మనుపటి రాజుతో పాటు చందపెల్లికి చెందిన బొజ్జ రాజశేఖర్ ఈ నెల 9న రాత్రి ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి 500 గ్రాముల వెండితో పాటు 4 గ్రాముల బంగారం, రూ.9వేల నగదు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.