
హ్యాండ్‌బాల్ పోటీల్లో బంగారు పతకాలు
మంచిర్యాలటౌన్: ఈనెల 24 నుంచి 26 వరకు హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ 7వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఆదివారం క్రీడాకారులు మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకోగా అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అమూల్య, కోచ్ సునార్కర్ అరవింద్, మేనేజర్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి రమేశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ రఘునాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.