
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో సెల్‌పాయింట్ దగ్ధం
జన్నారం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెల్‌పాయింట్ దగ్ధమైన సంఘటన మండలంలోని కలమడుగులో చోటు చేసుకుంది. బాధితుడు మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో తాళం వేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో షాపు లోపలి నుంచి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పివేశారు. ఆదివారం ఉదయం ఫైర్ అధికారి శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనలో మొత్తం రూ.16 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.