ఫోన్, టీవీకి దూరంగా ఉండండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): పరీక్షల వేళ విద్యార్థులు టీవీ, ఫోన్‌కు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బూర్గుపల్లి జెడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యా న్ని ఎంచుకొని బాగా చదవి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సందేహాలుంటే నివృత్తి చేయా లని ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment