బగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలోని బగలాముఖి అమ్మవారి శక్తి పీఠం ద్వితీయ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. 116 కలశాల గంగాజలం, పసుపునీటితో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవాని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment