డంపుయార్డు.. మాకొద్దు
నర్సాపూర్: ప్యారానగర్‌లో డంపుయార్డు ఎత్తి వేయాలంటూ నర్సాపూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. దీక్షలకు మద్దతుగా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన ప్రజలు తరలివచ్చా రు. స్థానిక నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎస్‌ఐ శ్రీనివాస్ రాస్తారోకోను విరమింపచేయడంతో అక్కడి నుంచి రిలే దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డంపుయార్డుతో నర్సా పూర్ అడవులతో పాటు చెరువులు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో జేఏసీ నాయకులు రాజేందర్, శ్రీధర్‌గుప్తా, రమణారావు, జగదీశ్వర్, నర్సింలు, ఆనంద్‌కుమార్, ఆంజిగౌడ్, దావూద్, జనార్దన్, సాగర్, మల్లేష్, చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment