హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదుల వెల్లువ
మెదక్ కలెక్టరేట్: హెల్ప్‌డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 68 వినతులు సమర్పించారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల కోసం అధికంగా ఉన్నాయి.
నకిలీ పట్టాతో భూమి కబ్జా..
తాతల కాలం నుంచి కాస్తులో ఉండి పట్టా కలిగిన ఆరెకరాల భూమిని, మా గ్రామానికి చెందిన కొందరు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన వడ్ల అంజయ్య హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేశారు. ఆరేళ్లుగా అధికారులు, కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదని వాపోయారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలంతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారని.. పొలం వద్దకు వెళ్తే దౌర్జన్యం చేస్తూ చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై న కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment