సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. సోమ వారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియామకమైన రెండో బ్యాచ్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏళ్ల పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. జిల్లాలో పగలు, రాత్రి సమయాల్లో జరిగిన దొంగతనాల్లో పోయిన డబ్బు కంటే ఆన్‌లైన్ మోసాలతో పోగొట్టుకున్న డబ్బే ఎక్కువన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కాబట్టి, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి నేర రహిత జిల్లాగా మార్చాలన్నారు. అంతకుముందు జిల్లాస్థాయి ప్రజా వాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
బీజేపీకి గుణపాఠం తప్పదు
గజ్వేల్: అమెరికా కొత్త ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న భారతీయులకు ప్రధాని మోదీ అండగా నిలవాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సోమ వారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికా అంశంపై స్పందించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తుండగా, బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై కులం, మతం పేరిట విమర్శలు చేయడం తగదన్నా రు. రాహుల్‌గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు ప్రజలందరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు. బీజేపీ అసంబద్ద విధానాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment