నాణ్యతలో రాజీ పడొద్దు
MýSÌñæMýStÆŠḥæÆ>çßæ$ÌŒ Æ>gŒæ
మెదక్‌జోన్: ‘మాత’కు అరకొర అహారం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పందించారు. సోమవారం ఎంసీహెచ్‌ను తనిఖీ చేశారు. పీడీయాట్రిక్, ఐసీవార్డు, గైనిక్ ఆపరేషన్ వార్డులతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందుతుందా..? అడిగి బాలింతలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటిన్‌లో అహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడొద్దని.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం అందజేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం వైద్యులతో కలిసి ఆస్పత్రిలో భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శివదయాల్, ఆర్‌ఎంఓ షర్మిల, ప్రిన్సిపాల్ రవీంద్రకుమార్, వైద్యులు ఉన్నారు.
సేవాలాల్ జీవితం ఆదర్శం
మెదక్ మున్సిపాలిటీ: బంజారా సమాజానికి సద్గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో నిర్వహించిన పూజలో పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడు కలు నిర్వహించడం శుభ పరిణామం అన్నా రు. సమాజ హితం కోసం ఆదర్శవంతమైన జీవి తం గడిపిన సంత్ సేవాలాల్ మహారాజ్ సేవల ను కొనియాడారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీ పడొద్దు
Comments
Please login to add a commentAdd a comment