నరేందర్‌రెడ్డిని ఆదరించండి
నర్సాపూర్ రూరల్: కాంగ్రెస్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యావంతుడైన నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంచిందన్నారు. పూటకో పార్టీ మారే వ్యక్తికి పట్టభద్రులు ఓటు వేసి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 52 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు 72 వేల మందికి పదోన్నతులు కల్పించిందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మకయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, కృష్ణ, మణిదీప్, సుధీర్‌గౌడ్, హకీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment