బాల్య వివాహాలను అరికడదాం
నర్సాపూర్ రూరల్: బాల్య వివాహాలు అరికట్టే బాధ్యత అందరిపై ఉందని మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారిత విభాగం సభ్యురాలు నాగమణి అన్నారు. మంగళవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ సేవా పథకం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భ్రూణహత్యలు, లింగవివక్షత, సీ్త్రల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్యవిహాలు మహిళల పురోగతికి అవరోధంగా మారాయన్నారు. రాజ్యాంగపరంగా మహిళలకు ఎన్నో హక్కులు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను రక్షించి చదివించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు సఖీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళులు మానసికంగా కృంగి పోకుండా ధైర్యంగా పోలీసులు, భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం అధికారిణి కళావతి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అడెప్ప, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సురేష్ కుమార్, అధ్యాపకులు సమీరా, రుక్మిణి, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగమణి
బేటీ బచావో.. బేటీ పడావోపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment