అపార్‌ఐడీ త్వరగా పూర్తిచేయండి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆపార్ ఐడీ త్వరగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ సెక్టోరియల్ అధికారి జ్యోతి అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని ఎీస్టీ ఆశ్రమ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆపార్‌ఐడీ కార్డులు వందశాతం పూర్తిచేయాలన్నారు. సమస్యలుంటే ఎంఈఓ, జిల్లా అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓ జయరాజ్, ఉపాధ్యాయులు దుర్గయ్య, నరేందర్, మంజూల, రాజేశ్వరీ, సత్యాగౌడ్, వినోద, గేమ్‌సింగ్, పీఈటీ పొనీల్‌కుమార్, ఏఎన్‌ఎం వెన్నెల, సీఆర్‌పీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ
జిల్లా సెక్టోరియల్ అధికారి జ్యోతి
Comments
Please login to add a commentAdd a comment