చిన్నమ్మకు నివాళి
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని కామా రం గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి మాతృమూర్తి బాలమణి అంత్యక్రియల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నమ్మ బాలమణి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీమన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌లు, తోటి పీఏసీఎస్ చైర్మన్‌లు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్ సుభాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment