బీజేపీవి మత రాజకీయాలు
మెదక్‌జోన్: బీజేపీవి మత రాజకీయాలని, కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య విలువలు కొనసాగుతాయని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల వారికి నష్టం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇసుక, మట్టి మాఫియా అరాచకాలు అంతా ఇంత కాదన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని కుల గణన, ఆరు గ్యారంటీలు అమలు చేసి కాంగ్రెస్ ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీకి మేలు చేసేందుకే బీఆర్‌ఎస్ పోటీలో అభ్యర్థిని నిలపలేదని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సుప్రభాత్‌రావు, సురేందర్ గౌడ్, రమణ, శ్రీనివాస్‌చౌదరి, ఆంజాగౌడ్, శ్రీనివాస్, పవన్, శేఖర్, రాజలింగం, మల్లేశం గౌడ్, మధుసుదన్‌రావు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
Comments
Please login to add a commentAdd a comment