పాలిటెక్నిక్‌తో.. కొలువు పక్కా!
● తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య ● ‘సాక్షి’తో మహిళా పాలిటెక్నికల్‌కళాశాల ప్రిన్సిపాల్ భవాని
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి అనంతరం విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యవైపు దృష్టి సారించాలని మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని సూచించారు. అతి తక్కువ ఖర్చుతో బంగారు బాటలు వేసేందుకు సాంకేతిక విద్యను అందిసున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా ఏఐ వైపు పరుగులు పెడుతోందని.. ఈ సమయంలో సాంకేతిక నైపుణ్యత లేకుంటే భవిష్యత్‌లో ఉపాధి దొరకడం కష్టమేనని అన్నారు. పాలిటెక్నిక్ విద్యతో లభించే ప్రయోజనాలను సోమవారం ఆమె ‘సాక్షి’కి వివరించారు. డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పరిశ్రమలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందులో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్‌లైన్స్, ట్రాన్స్‌పోర్ట్, గనులు, ఎస్‌సీసీఎల్, ఇండియన్ ఆర్మీ, నేవి, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈల్, బీడీఎల్, బీఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, డిఫెన్స్, ఎన్టీపీసీ వంటి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. ఇందుకోసం బ్యాంకులు సైతం రుణాలు త్వరితగతిన అందజేస్తాయి. పాలిటెక్నిక్ డిప్లొమాలో కంప్యూటర్, ఏఐ, మెషిన్ లర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ తదితర 24 కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.పాలిటెక్నిక్ అనంతరం ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. అందులో ఈసెట్ ద్వారా యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎంసెట్ ద్వారా యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరుగా ప్రవేశించవచ్చునని ప్రిన్సిపాల్ వివరించారు. మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్, సీఈసీ కోర్సులలో బోధించడానికి అనుభజ్ఞులైన అధ్యాపకులు ఉన్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన ల్యాబ్‌లు, టెక్నికల్ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇంజనీరింగ్ చేసి త్వరితగతిన ఉద్యోగం సాధించాలనుకునే బాలికలకు మంచి అవకాశం ఉన్నట్లు తెలిపారు.
హాస్టల్ వసతి
కళాశాలతోపాటు పరిసరాల్లోనే బాలికలకు ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. మహిళా వార్డెన్ అందుబాటులో ఉండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం హాస్టల్‌లో 102 మంది విద్యార్థులు ఉండి విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి అనంతరం బాలికలు అతితక్కువ ఖర్చుతో కూడిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను ఎంచుకొని త్వరిగతిన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రిన్సిపల్ భవాని సూచించారు.
పాలిటెక్నిక్‌తో.. కొలువు పక్కా!
Comments
Please login to add a commentAdd a comment