అంగన్‌వాడీలు బాధ్యతాయుతంగా ఉండాలి
అల్లాదుర్గం(మెదక్): అంగన్‌వాడీ టీచర్లు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి అన్నారు. మండలంలోని ముస్లాపూర్‌లో మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీచర్లు సమయపాలన పాటించాలని, పిల్లలకు ప్రీస్కూల్ కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చెప్పారు. ఆన్‌లైన్ రిపోర్టులు ఎప్పటికప్పుడు పూర్తి చేసి గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మేనరికం వివాహాల వల్ల అంగవైకల్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ పద్మలత, డీహెచ్‌ఈడబ్లూ సంతోషి, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి
Comments
Please login to add a commentAdd a comment