గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు
● డంప్‌యార్డ్ ఆలోచనఉపసంహరించుకోండి ● మాజీ మంత్రి హరీశ్‌రావు
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దని, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డంప్‌యార్డ్ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మ ంత్రి హరీశ్‌రావు ప్రభుత్వానికి సూచించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని నల్లవల్లి గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శుక్రవారం పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పేరుతో ఎమర్జెన్సీని తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని పంట పొలాల మధ్య డంప్‌యార్డ్ చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. ఈ సమస్యపై అసెంబ్లీ వేదికగా ఈ ప్రాంత ప్రజల తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు వెంటనే పనులను నిలిపివేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment