రోడ్లపై కోతులకు ఆహారం వేయొద్దు
డీఎఫ్‌ఓ జోజి
నర్సాపూర్ రూరల్: రోడ్లపై కోతులకు ఆహారం వేయొద్దని డీఎఫ్‌ఓ జోజి జంతు ప్రేమికులకు సూచించారు. శుక్రవారం జిల్లా అటవీశాఖ, వూన్‌హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ అర్బన్ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వచ్చే వానాకాలంలో కోతుల ఆహారం కోసం 22 వేలకుపైగా పండ్ల మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్లపై కోతులకు ఆహారం వేసే వారంతా అర్బన్‌పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఆహార సేకరణ కేంద్రంలో అందజేయాలని సూచించారు. రోడ్లు, జనావాసాలకు దూరంగా కోతులకు ఆహారం ఏర్పాటు చేసి మనుషులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇక్కడ విజయవంతం అయితే మిగితా ప్రాంతాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్యారనగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డ్‌తో జంతువులకు ఇబ్బంది తలెత్తకుండా 12 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డంప్‌యార్డ్‌తో నర్సాపూర్ రాయరావు చెరువులోకి వచ్చే నీరు కలుషితమయే ప్రమాదం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ప్రభు త్వ ఆదేశాలతో కొనసాగుతున్నందున దానిపై ఏమి మాట్లాడలేమని బదులిచ్చారు. కార్యక్రమంలో వూన్‌హాండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ పరమేశ్వరి, ఎఫ్‌ఆర్‌ఓ అరవింద్, సెక్షన్ ఆఫీసర్ సాయిరాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment