కాంగ్రెస్‌లో అన్నివర్గాలకు సమన్యాయం
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్‌లో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని డీసీసీ అ ధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకుడు సరాపు యాదగిరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చింతల యాదగిరి, శ్యాంతో పాటు నిజాంపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి చేస్తున్నారని కొని యాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తాము పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటు పడుతున్నామని అన్నారు. తనకు మెదక్ జిల్లా రాజకీయ బిక్ష పెట్టిందన్నారు. సొంత నిధులతో కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పట్టణంలో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచందర్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు యుగంధర్‌రావు, నిజాంపేట, హవేళీఘణాపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు నసీరుద్దీన్, శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, నాయకులు అమరసేనారెడ్డి, అరుణ, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
Comments
Please login to add a commentAdd a comment