విద్యార్థి జీవితంలో ‘పది’ కీలకం
డీఈఓ రాధాకిషన్
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలక మలుపని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడూర్, మిర్జాపల్లి జెడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత విద్యకు పదో తరగతి ఒక బేస్‌గా నిలుస్తుందన్నారు. ఇక్కడ పునాది పడితేనే ఇంటర్, డిగ్రీలో సునాయాసంగా గట్టెక్కగలుగుతారన్నారు. సబ్జెక్ట్‌పై పట్టు సాధించిన విద్యార్థులే మెరుగైన గ్రేడ్ సాధించగలరని తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం 36 రోజులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలన్నారు. ఉదయం, సాయంత్రం చదవగలిగేతేనే పాఠ్యంశం మనసులో నిలిచిపోతుందని వివరించారు. ఈసందర్భంగా హెచ్‌ఎం రవీందర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. అంతకుముందు మిర్జాపల్లి జెడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. కరాటేలో ప్రతిభ కనబర్చి గోల్డ్‌మోడల్ సాధించిన విద్యార్థి రేణుక, రజిత పతకం పొందిన కావ్య, అనూషను అభినందించారు. ఆయన వెంట ఏఎంఓ సుదర్శన్, ఎంఈఓ పుష్పవేణి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment