
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్
చిన్నశంకరంపేట(మెదక్)/పాపన్నపేట: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కామారం తండాలో సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన కా ర్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. కార్యక్రమంలో మోహన్‌నాయక్, రవినాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు రాజిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నార్సింగి శివారులో గల సేవాలాల్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ధర్మ సంస్థాపన కోసం సేవాలాల్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ముంగి దేవగిరి మహరాజ్ పాల్గొని పూజలు చేశారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Comments
Please login to add a commentAdd a comment