
ప్రతిభను చాటేందుకు సదావకాశం
మెదక్ కలెక్టరేట్: యువత తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాధాకిషన్, డీవైఎస్‌ఓ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యువ ఉత్సవం ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక మంచి వేదిక లభించిందన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, రచనా పోటీలు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. యువత ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి విజేతల వివరాలను జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కాగా, విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు గణపతి, తిరుమలరెడ్డి, మురళి, దీపికా, సురేష్, వెంకటేశ్వ ర్లు, అధికం రాజు, యువజన సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల ప్రతినిధులు రాజు, 640 మందిపైగా యువతి యువకులు పాల్గొన్నారు.
యువజనులు సద్వినియోగం చేసుకోవాలి
డీఈఓ రాధాకిషన్
Comments
Please login to add a commentAdd a comment