
త్వరలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు
కార్యాలయాన్ని పరిశీలించిన న్యాయమూర్తి
తూప్రాన్: డివిజన్ కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు కార్యాచరణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కోసం ఎంపీడీఓ కార్యాలయం భవనాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, తహసీల్దార్ కార్యాలయం, వృథాగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. కాగా ఎంపీడీఓ కార్యాలయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తూప్రాన్‌లో జూనియర్ సివిల్ కోర్టు భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు దూరభారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment