సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్
మెదక్ కలెక్టరేట్: కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ ఆరోపించారు. శనివారం కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన ిసీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో అసంఘటిత కార్మికలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఐదు రకాల జీఓలు ఇచ్చిన, గెజిట్ చేయలేదని హైకోర్టులో కేసు నడుస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్‌పోర్డు, హమాలీ రంగంలో సంక్షేమ బోర్డు లేదని, దీని మూలంగా వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వీటి పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన హైదరాబాద్ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశం, కడారి నర్సమ్మ, నాగరాజు, నాగేందర్ రెడ్డి, బాలమణి, సంతోష పాల్గొన్నారు.