దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్‌లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం ముందుగా బెల్ట్‌షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు.
అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి