Amitabh Bachchan Shares Abhishek Bachchan's Childhood Photos - Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ స్టార్‌ హీరో చిన్ననాటి ఫొటోలు

Published Fri, Feb 5 2021 3:53 PM | Last Updated on Fri, Feb 5 2021 5:46 PM

Abhishek Bachchan Childhood Photos - Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ముద్దుల తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 5). ఈ రోజు ఆయన 45వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా కొడుక్కు బర్త్‌డే విషెస్‌ చెప్పాడు బిగ్‌బీ. "చిన్నప్పుడు వాడి చేయి పట్టుకుని ముందుకు నడిపించాను. ఇప్పుడు వాడు నా చేయి పట్టుకుని ముందుకు తీసుకెళుతున్నాడు" అని ఎమోషనల్‌ అవుతూ ఒకేచోట చేర్చిన రెండు ఫొటోలను షేర్‌ చేశాడు. దీనికి అభిషేక్‌ 'థ్యాంక్‌ యూ పా' అని రిప్లై ఇచ్చాడు. మరి ఇప్పటి స్టార్‌ హీరో జూనియర్‌ బచ్చన్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో కింది ఫొటోల ద్వారా చూసేద్దాం..

తాష్కెంట్‌ షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటో ఇది. ఇందులో అభిషేక్‌ తొలిసారి ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. ఈ మధ్యే అమితాబ్‌ ఈ ఫొటోను షేర్‌ చేశాడు.

ఆమధ్య తండ్రితో పాటు అభిషేక్‌ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తొందరగానే నా మహమ్మారిని జయించి ఆయన క్షేమంగా ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా అతడి సోదరి శ్వేత నంద పట్టరాని సంతోషంతో అతడికి స్వాగతం చెప్తూ ఈ ఫొటో షేర్‌ చేసింది. 

కొడుకును భుజాలపై ఎక్కించుకుని ఆడించాలని ఎవరికి ఉండదు. తండ్రి మీద ఎక్కి తిరగాలని ఏ పిల్లోడికి ఉండదు. అందుకే కొడుకును భుజాన ఎక్కించుకుని ఆడిస్తున్నాడు అమితాబ్‌. ఈ ఫొటో చూస్తుంటే చాలామందికి వారి బాల్యం గుర్తుకురాక మానదు.


ప్రేమను కురిపిస్తూ తల్లి జయా బచ్చన్‌ కొడుకు వంకే తదేకంగా చూస్తుంటే అభిషేక్‌ మాత్రం తననెవరో ఫొటో తీస్తున్నారంటూ కెమెరా వైపు చూస్తున్నాడు. ఈ తల్లీకొడుకుల ఫొటో చాలామంది అభిమానులకు ఫేవరెట్‌.

అభిషేక్‌ కెమెరా ముందుకు రావాలంటే చాలా సిగ్గుపడేవాడు. ఈ విషయం పై ఫొటో చూస్తేనే తెలిసిపోతుంది. ఎంతో బిడియస్తుడులా దగ్గరకు ముడుచుకుపోయాడు. తల వాల్చి ఓరకన్నుతో చూస్తున్న ఈ ఫొటో క్యూట్‌గా ఉందంటున్నారు అభిమానులు.

సినిమాల్లో ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం అమితాబ్‌ కూల్‌గా ఉండేటట్లు కనిపిస్తోంది. కొడుకుతో కలిసి పార్క్‌లో ఆడుకుంటున్నాడు అమితాబ్‌. తండ్రి చుట్టూ చేతులు వేసి సరదాగా నవ్వుతుంటే అతడి పప్పా మాత్రం కూతురు శ్వేత వైపు చూస్తున్నాడు.


చిన్నప్పుడే తండ్రిలా రెడీ అవడం మొదలు పెట్టినట్లున్నాడు అభిషేక్‌. తండ్రి సూటుబేటు వేస్తే అచ్చంగా అలాంటి సూటూబూటేసుకున్నాడీ హీరో.

ఇంకా వారి ఆల్బమ్‌లో బోడెన్ని ఫొటోలున్నాయి. వాటన్నింటినీ చూడాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి..


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్‌ స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement