
టాలీవుడ్ యంగ్ హీరో, సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. అపోలో ఆసుపత్రిలో ఆయనకి చికిత్స జరుగుతోంది. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసిన ఎంతో మంది సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడారు. ‘మా అబ్బాయి నవీన్‌కి తేజ్ క్లోజ్‌ఫ్రెండ్. ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారు. బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా, కానీ ఆలోపే వెళ్లిపోయారు.
పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరం. వేగం విషయంలో యువత కంట్రోల్ ఉండాలి. నాకు ఒకసారి చిన్న ప్రమాదం జరగడంతో.. బాధతో మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో మళ్లీ బైక్ ముట్టుకోలేదు. కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరి అందరూ అనవసరంగా బైక్ ముట్టుకోకుండా ఉండాల’ని నరేశ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment