
చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత జి.రామచంద్రన్(73) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కలత్తూరు కన్నమ్మ, నాట్టుపుర పాట్టు, ఎట్టుపట్టి రాసా, వీర తాలాట్టు, రాజాధిరాజ, మనునీతి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. నిర్మాతగా జీఆర్‌టీ గోల్డ్ ఫిలిమ్స్ పతాకంపై మనునీతి, సౌండ్ పార్టీ, కాసు ఇరుక్కున్న, ఎంగరాశి నల్లరాశి, కాదలి కానవిల్‌లై వంటి చిత్రాలతో పాటు కన్నడలోనూ పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే ఈయన సతీమణి ఆర్.వి.పూరణి గుండెపోటుతో కన్నుమూశారు. వీరికి కుమారులు శివకుమార్, ఆర్ స్వామికుమార్ ఉన్నారు. మాంగాడులోని ఆయన ఫాంహౌస్ వద్ద బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment