సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి | Actor Raghu Babu Car Accident | Sakshi
Sakshi News home page

సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి

Published Wed, Apr 17 2024 10:05 PM | Last Updated on Thu, Apr 18 2024 9:31 AM

Actor Raghu Babu Car Accident - Sakshi

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారును ఒక బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందినట్లు తెలుస్తోంది. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రఘుబాబుది తప్పులేదని వీడియోలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి అసలు విషయాలు వెళ్లడించనున్నారు.

నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం అని తెలుస్తోంది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement