
బుల్లితెర నటుడు, కమెడియన్ తమిళ సెల్వన్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి పూర్ణిమ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మంగళవారం (నవంబర్ 28న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ పెళ్లి ఫోటోను షేర్ చేశారు.
'నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నానో! నువ్వు నీకోసం మాత్రమే కాకుండా నాకోసం ఎంత పరితపిస్తున్నావో అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను నీలో కలుపుకున్నందుకు ఎంతగానో లవ్ చేస్తున్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా తమిళ సెల్వన్.. మిస్టర్ మనైవి, అభియుమ్ నానుమ్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. మొదట కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు తర్వాత నటుడిగా రకరకాల పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు.
చదవండి: త్రిషకు సారీ చెప్పానా? నో ఛాన్స్.. అంత సీన్ లేదన్న నటుడు
Comments
Please login to add a commentAdd a comment