Chrisann Pereira Drug Case: Actress Chrisann Pereira Released From Sharjah Jail On Bail In Drug Smuggling Case - Sakshi
Sakshi News home page

Chrisann Pereira Drug Case: శత్రువులకు కూడా రాకూడదని కోరుకోండి: క్రిషన్ పెరీరా

Published Fri, Apr 28 2023 6:59 AM | Last Updated on Fri, Apr 28 2023 8:42 AM

Actress Chrisann Pereira released from Sharjah jail in drug smuggling case - Sakshi

ఇటీవల దుబాయ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరాకు ఊరట లభించింది. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలైంది. అయితే జైలులో తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 26 రోజుల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. 

నేను జైల్లో ఉన్నన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డానని క్రిసాన్ పెరీరా తెలిపింది. టైడ్‌ సర్ఫ్‌తో స్నానం, టాయిలెట్‌ వాటర్‌లో కాఫీ తాగానని ఆవేదన వ్యక్తం చేసింది. జైల్లో కనీసం పెన్‌ కూడా దొరకలేదని వివరించింది. ఒక పెన్‌ కోసం నాకు 20 రోజుల సమయం పట్టిందని వెల్లడిచింది. ఆ నరకం నా జీవితంలో మరెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాని తెలిపింది. మన శత్రువులకు సైతం ఇలాంటి గతి పట్టకూడదని పేర్కొంది. 

కాగా.. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిషన్ పెరీరా షార్జా జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బాలీవుడ్ నటి  పెరీరాను ఈ నెల ప్రారంభంలో షార్జాలో అరెస్టు చేశారు. ఆమె ట్రోఫీలో డ్రగ్స్ దాచిపెట్టినట్లు గుర్తించారు.  27 ఏళ్ల క్రిషన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఈ కేసులో బాలీవుడ్ నటిని ఇరికించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ముంబైలోని బోరివలికి చెందిన ఆంథోనీ పాల్, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన రాజేష్ బభోటే అలియాస్ రవిగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement