
Actress Maheshwari Shocking Comments On Director Ram Gopal Varma: గులాబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మహేశ్వరి. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుకు దగ్గరైన ఈ బ్యూటీ తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకి గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాను పంచుకుంది. ఇక టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ విషయంలో తనను మోసం చేసినట్లు పేర్కొంది. 'అది దెయ్యం సినిమా షూటింగ్. మేడ్చల్‌లోని ఓ పాడుపడ్డ ఫామ్‌హౌస్‌లో స్మశానం సెట్ వేశారు.
అక్కడి నుంచి మెయిన్ రోడ్‌కి సుమారు 2కిలోమాటర్ల దూరం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంటుంది. రాత్రి 1గంటకి షూటింగ్. అప్పుడు వర్మ మీలో ఎవరైనా ఎవరైనా మెయిన్ రోడ్ వరకు వెళ్లొస్తే రూ. 50వేలు ఇస్తానని పందెం కట్టారు. దీంతో భయపడుతూనే వెళ్లి వచ్చాను.
కానీ ఇంతవరకు ఆయన ఇస్తానన్న రూ.50వేలు మాత్రం ఇప్పటికీ ఇవ్వకుండా చీట్ చేశారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆర్జీవీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన దెయ్యం సినిమాలో జెడి చక్రవర్తి, మహేశ్వరి హీరో, హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment