Actress Malobika Banerjee Shocking Comments On Vijay Devarakonda, Deets Inside - Sakshi
Sakshi News home page

Malobika Banerjee: విజయ్‌పై బాలీవుడ్‌ నటి సంచలన కామెంట్స్‌, ‘లైగర్‌ టీజర్‌ చూసి నవ్వుకున్నా’

Published Wed, Oct 26 2022 3:16 PM | Last Updated on Wed, Oct 26 2022 3:54 PM

Actress Malobika Banerjee Shocking Comments On Vijay Devarakonda - Sakshi

‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ నటి మలోబిక బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గతంతో విజయ్‌ హిందీ భాషను అవమానించేలా మాట్లాడాడంటూ బెంగాలీ నటి, సింగర్‌ అయిన మలోబిక బెనర్జీ తెలిపింది. రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా లైగర్‌ మూవీ గురించి ప్రస్తావించింది. ఒకప్పుడు హిందీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన విజయ్‌, ఇప్పుడు అదే భాషలో సినిమా తీశాడంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయ్‌తో నేను కలిసి ‘నీ వెనకాలే నడిచి’ మ్యూజిక్‌ వీడియోలో నటించాం. 

చదవండి: Samantha Shocking Look: సామ్‌ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి!

అప్పటికే విజయ్‌ నటించిన అర్జున్‌ రెడ్డి మూవీ హిట్‌ కావడంతో​ అతడు పాపులర్‌ అయ్యాడు. ఆ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ సమయంలోనే విజయ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. నాకు మంచి స్నేహితుడయ్యాడు. సెట్‌లో మేం సరదాగా మాట్లాడుకునేవాళ్లం. అప్పటికి విజయ్‌కి హిందీ పూర్తిగా రాదు. అందుకే తనేప్పుడు తెలుగులోనే మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం ఎక్కువగా హిందీలోనే మాట్లాడేదాన్ని. ఇక నేను హిందీలో మాట్లాడుతుంటే విజయ్‌ నవ్వుకునేవాడు. తనకు హిందీ పెద్దగా అర్థం కాదని, అది హెబ్రూ భాషలా అనిపిస్తుందంటూ అవహేళన చేశాడు. అలాంటి విజయ్‌ హిందీలో సినిమా తీశాడని తెలిసి షాకయ్యా. ఎందుకంటే ఒకప్పుడు హిందీని  అవమానించేలా మాట్లాడిన వ్యక్తి.. అదే భాషలో సినిమా తీశాడు. 

చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా?

కొన్నేళ్లకు లైగర్‌ టీజర్‌లో విజయ్‌ని చూసి నవ్వుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.  అయితే ఈ విషయాన్ని లైగర్‌ ప్రమోషన్స్‌ సమయంలోనే చెబుదాం అనుకున్నానని, అయితే విజయ్‌ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆ పని చేయలేకపోయానంది. అంతేకాదు విజయ్‌ టీజర్‌ను సోషల్‌ మీడియా షేర్‌ చేసి ‘వెల్‌కమ్‌ టూ బాలీవుడ్‌’ అనే మెసేజ్‌ కూడా పెట్టానంది. ఆ తర్వాత తెలిసిందేంటంటే హిందీలో విజయ్‌కి ఎక్కువ డైలాగ్స్‌ లేవని తెలిసిందని పేర్కొంది. అయితే ఏది ఏమైనప్పటికి విజయ్‌ చాలా మంచి మనిషి అని, చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడంటూ చివరిలో ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ చిత్రం బాక్సాఫిసు ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement