ఛాన్సులే రావనుకుంటే రీఎంట్రీతో దుమ్మురేపుతున్న వెటరన్‌ బ్యూటీ | Actress Manju Warrier Reentry Response | Sakshi
Sakshi News home page

ఛాన్సులే రావనుకుంటే రీఎంట్రీతో దుమ్మురేపుతున్న వెటరన్‌ బ్యూటీ

Published Wed, Sep 11 2024 6:22 AM | Last Updated on Wed, Sep 11 2024 1:41 PM

Actress Manju Warrier Reentry Response

ప్రతిభ కలిగిన వారికి సినీ రంగంలో గ్యాప్‌ వస్తుందేమో గానీ, మళ్లీ రాణించడం మాత్రం పక్కా. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. ఇండియన్‌ కథానాయకిగా పేరు గాంచిన ఈమె ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమయ్యారు. త్రిష పని అయిపోయిందీ అనే మాట కూడా చిత్ర వర్గాల్లో వినిపించింది. అలాంటిది పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిశారు. అంతే ఇప్పటికీ విజయ్‌, అజిత్‌, కమలహాసన్‌ వంటి సీనియర్‌ స్టార్స్‌కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు.

మలయాళ భామ మంజువారియర్‌ది దాదాపు ఇదే పరిస్థితి. ఈమె కూడా మలయాళంలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే నటుడు దిలీప్‌ను 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత నటనకు గ్యాప్‌ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆ తరువాత మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయారు. అలా 15 ఏళ్ల తరువాత మంజువారియర్‌ నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ 46 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు సీనియర్‌ నటులకు ఆప్షన్‌ కథానాయకిగా మారారు. తమిళంలో బిజీగా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల్లో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ సాంగ్‌

ఇంతకుముందు అజిత్‌కు జంటగా తుణివు. ధనుష్‌ సరసన అసురన్‌ చిత్రాలలో నటించారు. తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో విడుదలై 2 చిత్రంలోనూ, రజనీకాంత్‌ సరసన వేట్టైయాన్‌ చిత్రంలోనూ నటించారు. వీటిలో వేట్టైయాన్‌ చిత్రం అక్టోబర్‌ 10న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో మంజువారియర్‌ స్టెప్స్‌ వేసిన పాట ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా ఈ పాటలో మంజువారియర్‌ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement