
ఇది వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు వరసపెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం చేసుకుంది. వేలికి ఉంగరంతో పాటు భర్తతో కలిసున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెకి కాబోయే భర్త ఎవరు?
ఈమె పేరు పూజా సావంత్. మరాఠీ హీరోయిన్. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. 2010లో మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి బోలెడంత క్రేజ్ సంపాదించింది. పలు టీవీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు అభిమానులకు షాకిస్తూ, తాను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది.
(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)
అయితే కాబోయే భర్త ఎవరు? ఏంటనేది మాత్రం చెప్పలేదు. అలానే అతడి ముఖం కూడా రివీల్ చేయకుండా ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే ఇతడు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని, ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ కంపెనీకి ఓనర్ అని సమాచారం. త్వరలో ఎలానూ పెళ్లి జరుగుతుందిగా. అంతలో కచ్చితంగా ఇతడెవరు? పేరేంటి? తదితర వివరాలు బయటకొస్తాయి.
ఇకపోతే పూజా సావంత్‌కి మరాఠీ ఇండస్ట్రీలో భూషణ్, వైభవ్ అని ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో భూషణ్‌తో పూజా రిలేషన్ లో ఉందని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీతో వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో అవన్నీ కూడా రూమర్స్ అని తేలిపోయింది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment