
కొందరు కొన్ని అలవాట్లను వదులుకోలేరు. హీరోయిన్ సాయిపల్లవికి ఒక విచిత్రమైన అలవాటు ఉందట. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో దాన‍్ని కొంతకాలం పక్కనపెట్టి మెడిలస్ పూర్తి చేసింది. 1992లో నీలగిరి ప్రాంతంలో పుట్టిన ఈమె.. 2015లో వైద్య విద్యను పూర్తి చేసింది. వయసులో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ గా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కస్తూరి మాన్, దామ్ ధూమ్ అనే చిత్రాల్లో చిన్నపాత్రల్లో నటించింది. ఇక పూర్తిస్థాయిలో కథానాయకిగా నటించిన చిత్రం ప్రేమమ్.
(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)
ఈ మలయాళ చిత్రం ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మలయాళ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. ముఖ్యంగా తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తమిళంలో సూర్యతో చేసిన 'ఎన్‌జీకే' నిరాశపరిచింది. చిన్నతనం నుంచి నాట్యంలో శిక్షణ తీసుకున్న సాయి పల్లవి 2008లోనే ఉంగళిల్ యార్ అడుత్త ప్రభుదేవా అనే టీవీ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది.
అయితే సాయిపల్లవి డ్యాన్స్ షోలో పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు. సరే ఇవన్నీ పక్కనబెడితే సాయిపల్లవి తనకు ఓ విచిత్రమైన అలవాటు ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను తరచూ విభూదిని తింటానని, అది అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తన బ్యాగులో ఎప్పుడు విభూది ఉంటుందని, అది విశేషమైన చెట్టు నుంచి తయారు చేస్తారని పేర్కొంది. ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా కమలహాసన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment