
రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఆమె, కీలక పాత్ర చేసేది ఆ నటుడు అని పలు రూమర్స్ అయితే వినిపించాయి. అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఓ నిర్ణయానికి రాలేం. కానీ రీసెంట్‌గా 'ఆదిపురుష్' నటుడు రాజమౌళిని కలవడం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)
'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవ్‌దత్తా నాగే.. స్వతహాగా మరాఠీ నటుడు. కానీ ఇతడిని డైరెక్టర్ ఓం రౌత్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. 'జై మల్హార్' లాంటి సీరియల్‌లో తన అద్భుత నటనతో దేవ్‌దత్తా ఆకట్టుకున్నాడు. పలు సినిమాలు కూడా చేశారు. తెలుగులో ప్రస్తుతం 'దేవకినందన వాసుదేవ' అనే ఓ మూవీలో చేస్తున్నాడు.
ఇకపోతే రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో రాజమౌళిని దేవ్ దత్తా నాగే కలిశాడు. ఫొటో తీసుకుని తన ఆనందాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో బయటకు రావడం లేటు.. రాజమౌళి మూవీలో ఇతడు నటిస్తున్నాడని అంటున్నారు. బహుశా ఇది కూడా నిజమే అయ్యిండొచ్చు. కానీ ఇప్పుడే ఎందుకని చెప్పట్లేదేమో? ఒకవేళ దేవ్‌దత్తాని సినిమా కోసం తీసుకుంటే మాత్రం మంచి ఆప్షనే అవుతుంది.
(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment