పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి. సమ్మర్ స్పెషల్‌గా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రానుందట.
(చదవండి: ఆస్పత్రిలో చేరిన అలియా)
అయితే మరో రెండు నెలల్లో తమ అభిమాన హీరో సినిమా వస్తుందని భావించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. పోని సమ్మర్‌లో అయినా వస్తుందా అంటే.. అది కూడా డౌటేనంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌పై పలు విమర్శలు వచ్చాయి. వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని, సీజీ పనులు మరీ దారుణమని నెటిజన్స్ ట్రోల్ చేశారు.
అంతేకాదు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంచి ఔట్‌పుట్ తీసుకురావడం కోసం చిత్ర బృందం మళ్ళీ విజువల్స్ మీద వర్క్ చేయడానికి రెడీ అయిందని టాక్. దీని కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే.. ఆదిపురుష్ చిత్రం సమ్మర్‌లో కూడా రావడం అనుమానమే అని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే 'ఆది పురుష్' సినిమాకు దాదాపు 450 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment